చిన్నఆశ http://chinniaasa.blogspot.in/
నా బ్లాగ్ లో కామెంట్స్ ద్వారా చిన్న ఆశ నాకు పరిచయం.
నేను మొట్టమొదట ఈ బ్లాగ్ లో చదివినది
తొలి ఉత్తరంలో పొదిగిన నీ అక్షర ముత్యాలుhttp://chinniaasa.blogspot.in/2011/05/blog-post_21.html
తొలి స్నేహం ప్రియంగా మారిన మన పరిచయంతొలి పరిచయం ప్రేమగా నీతో పెరిగిన యవ్వనం
తొలి సారి నిను చూసిన మధురమైన ఆ రోజు
తొలి చూపులో నీ కళ్ళల్లో ని బంగారు కాంతులు
ఈ కవిత చదివి చాలాసేపు అలా ఉండిపోయాను.
మొత్తం కవిత చదివితే మీరు కూడా నాతో ఒప్పుకుని తీరతారు.
తర్వాత అప్పుడప్పుడు బ్లాగ్ చూస్తూ ఉంటాను. చాలావరకు కవితలే ఉంటాయి ఈ బ్లాగ్ లో.చాల కవితలు మనం చదువుతూ ఉంటాం...కాని ఈ కవితలు చూస్తె నాకు అవి కవితలు ల అనిపించవు.ఎందుకు ఈ మాట అన్నానో చెప్తా వినండి.
ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మనసువిప్పి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మళ్ళి ఆ మాట్లాడటంలో అవతలి వాళ్ళు ఏదయినా అనుకుంటారు అని ఆ మాటల్లో కొన్ని మింగేసి చెప్పాలనుకున్న దానికి ఏమి అనుకోకు, నీ మనసు నొప్పిస్తే సారీ ఇలా కాకుండా స్వేచ్చగా మనతో మనం ఉన్నట్టుగా మనతో మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. మన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పుకునేందుకు ఒకరు ఉన్నారు అన్న సంబరం ఎలా ఉంటుందో అది కనిపిస్తుంది ఇక్కడ.అసలు ప్రేమకి నిర్వచనం అదే కదా ...!!ఎలాంటి భేషజాలు, అహం లాంటివి లేకుండా మనసు విప్పు మాట్లాడుకోగలగడమే కదా ఆ ప్రేమ చిట్టి పండు ల మధ్య ఉన్నది కాబట్టే ప్రతి కవితలోనూ ఒక మనసు ఇంకో మనసుకోసం పడే ఆరాటం కనిపిస్తుంది.
చిన్ని ఆశ ఒకరి బ్లాగ్ కాదు చిట్టి, పండు అనే ఇద్దరి బ్లాగ్.
చిట్టి అనే అమ్మాయి, పండు అనే అబ్బాయి.వీరిద్దరి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ http://chinniaasa.blogspot.in/2010/08/blog-post.htmlచదవండి.
నా పండు ఎలా ఉన్నాడో, ఒక్కసారైనా జీవితంలో చూడగలనా అన్న "చిన్ని ఆశ" తో నిత్యం తపిస్తూ చిట్టి, నా చిట్టి ఎక్కడుందో ఎలా ఉందో, మళ్ళీ జీవితంలో తారసపడుతుందా అన్న "చిన్ని ఆశ" తో అనునిత్యం పరితపిస్తూ పండు, ఎప్పటికైనా ఈ జీవితంలో మళ్ళీ కలిసేనా, కలవకుండానే ప్రాణం పోతే ఎలా అన్న క్షోభతోనే ఇద్దరూ...ఆ తపన, ప్రేమ, వారి కవితలలో కనిపిస్తూనే ఉంటుంది.చిట్టి కి పండు ప్రోత్సాహం, పండుకి చిట్టి ప్రేరణ ఇలా వారి బ్లాగ్ మొన్ననే వంద పోస్ట్లు లు పూర్తి చేసుకుంది.
వీళ్ళిద్దరూ ఒక్కరా ఇద్దరా అని కొంచం మనకి సందేహం ఉంటుంది కదా...
పండు గారు మేము ఇద్దరం అని చెప్పారు కాబట్టి వీళ్ళు ఇద్దరు.చిట్టి, పండు కలిసి కవితలు రాస్తారు బొమ్మలు మాత్రం చిట్టి ప్రోత్సాహంతో పండు వేస్తారు.కవిత కోసం బొమ్మ వేసారా? లేక బొమ్మ కోసం కవిత రాసారా? అని నాకు ఎప్పుడు సందేహంగానే ఉంటుంది.
ఇక చిన్ని ఆశ నేస్తాలు ఎవరో తెలుసా? చందమామ, చిరుగాలినట http://chinniaasa.blogspot.in/2010/08/blog-post_25.html
చందమామని, చిరుగాలిని అడిగి చిట్టి, పండు ఎలా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారో తెలియాలంటే ఆ లింక్ చూడండి.
పువ్వుల గురించి , అనుబంధం, ఆకాశం, ఆరాధన, కన్నీరు,చందమామ, జ్ఞాపకాలు ఇలా ఎన్నో ...వాటిల్లో ఎన్నో కవితలు.ఆ కవితలకి అందమయిన బొమ్మలు.
ఒకసారి ఆ బ్లాగ్ లోకి వెడితే తిరిగి రావడం కష్టం.
నాకు మాత్రం చిని ఆశ బ్లాగ్ కి వెడితే నాకు చాల ఇష్టం అయిన పాట గుర్తుకు వస్తుంది.
"లలిత ప్రియ కమలం విరిసినది ..."అని
చిట్టి, పండు ఏనాటికి అయిన కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
miru cheppinatte chala andhanga mana manasuku prathibimbanla undhi e chinniaasa blog.
ReplyDeleteనేను మీతో ఏకీభవిస్తానండి...నాకు నచ్చిన బ్లాగ్స్ లో ఇది ఒకటి. చిట్టిపండు లాగే చిలిపిగా ముద్దుగా లాలిస్తున్నట్లు మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది.
ReplyDeleteచిన్ని ఆశ గురించి బాగా వ్రాశారు శైల గారూ.
ReplyDelete@ వసుంధర గారు ! చిన్ని ఆశ గారి బ్లాగ్ మీ మనసుకు ప్రతిబింబంలా ఉందని అంటున్నారా?
ReplyDeleteచిన్ని ఆశ గారికి చెప్పండి ఎంతో ఆనందిస్తారు.
అన్నట్టు మీ కవితలు కూడా చాలా బావుంటాయండి.
@పద్మార్పిత గారు! ధన్యవాదాలు.మీ బ్లాగ్ నిదానంగా చదువుతాను.
@జ్యోతిర్మయి గారు! బావున్నారా? థాంక్స్ అండీ.
@ కల్లూరి శైలాబాల గారూ !
ReplyDeleteఒక మంచి బ్లాగు గురించి , ఏ మాత్రం భేషజం లేకుండా మీ బ్లాగులో పోస్టు పెట్తినందుకు మీకు అభినందనలు చెప్పాలనిపించింది. మీ గొప్పతనం కు 'చిన్నిఆశ'కూడా ప్రేరణ కావడం ముదావహం !
avunu sailoo...nenu aa blog intaku mundu chadivi nee laage feel ayyaanu...vaariki shubaakaankshalu
ReplyDeleteకొండల రావు గారు ! ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా కొన్ని మంచి బ్లాగ్స్ గురించి రాసాను.మీకు వీలుంటే నేను మెచ్చే బ్లాగ్స్ ఫోల్డర్ చూడగలరు.
ReplyDeleteఅలా అని ఇంకా మంచి బ్లాగ్స్ లేవు అని కాదు
బ్లాగ్ మొత్తం చదివి ఒక అవగాహనకి వచ్చి రాయడానికి కొంత టైం పడుతుంది.కనీసం నెలకి ఒక బ్లాగ్ గురించి అయిన రాయాలని అనుకుంటూ ఉంటాను.కాని కుదరడం లేదు.
శశి కళ గారు థాంక్ యు.
ReplyDeleteమీరు వ్రాసిన వాటిల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు! చాలా బాగా వ్రాశారు "చిన్ని ఆశ" గురించి!
ReplyDeleteరసజ్ఞ గారు థాంక్స్ అండీ
ReplyDeletechinni aasa gurinchi chaalaa baagaa raasaarandi . naenu regular gaa chadive blog la loe idi okati .
ReplyDeleteశైలబాల గారూ, మెచ్చిన మీ బ్లాగుల్లో మా "చిన్ని ఆశ" చోటు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.
ReplyDeleteముందుగా మీకు ధన్యవాదాలు. అదే చెప్తూ మీకోసం ప్రత్యేకంగా బొమ్మా వేసి మా "చిన్ని ఆశ" లో ధన్యవాదాలు చెప్పుకున్నాము.
మీరు రాసినది చదివి మెచ్చుకుంటూ, ఏకీభవిస్తూ స్పందించిన అందరికీ పేరు పేరునా మరొక్కసారి ధన్యవాదాలు.